పనీర్ పాప్ కార్న్ | 5 నిమిషాల్లో బెస్ట్ పనీర్ స్నాక్

Snacks | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 5 Mins
  • Total Time 15 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms పనీర్
  • నూనె వేపుకోడానికి
  • కోటింగ్ కోసం
  • 1/4 cup మైదా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • 1 tsp చిల్లి ఫ్లేక్స్
  • 1 tsp మిక్స్డ్ హెర్బ్స్
  • తగినన్ని నీళ్ళు
  • 1 cup బ్రెడ్ పొడి

విధానం

  1. కోటింగ్ కోసం ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి.
  2. పనీర్ ముక్కలు వేసి కోటింగ్ బాగా పట్టించాలి.
  3. తరువాత ఒక్కో పనీర్ ముక్క తీసి బ్రెడ్ పొడి లో బాగా రోల్ చేయండి. బ్రెడ్ పొడిలో ఒకటికి రెండు సార్లు రోల్ చేసి బాగా పట్టించండి.
  4. ఇలా అన్నీ కోట్ చేసుకున్నకా 30 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి.
  5. 30 నిమిషాల తరువాత వేడి నూనెలో మంట పూర్తిగా తగ్గించి పనీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి.