పల్లీల రైస్ | లంచ్ బాక్స్ స్పెషల్ | మిగిలిపోయిన అన్నంతో ఇలా చేస్తే చాల ఎంజాయ్ చేస్తారు
Flavored Rice
|
vegetarian
Prep Time2 Mins
Cook Time15 Mins
Total Time17 Mins
Servings4
కావాల్సిన పదార్ధాలు
1/4
cup వేరుసెనగపప్పు
1/4
cup నువ్వులు
4
ఎండు మిర్చి
1/4
cup పచ్చి కొబ్బరి
1
cup ఉడికిన్చుకున్న అన్నం బియ్యాన్ని వండినది
ఉప్పు
1/4
cup నూనె
1/2
tsp ఆవాలు
1
tsp మినపప్పు
1
tsp సెనగపప్పు
2
రెబ్బలు కరివేపాకు
విధానం
ముందు మూకుడులో వేరుసెనగపప్పు వేసి కేవలం లో-ఫ్లేం మీద మాత్రమే 3-4 నిమిషాలు రోస్ట్ చేసుకోండి
ఆ తరువాత ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, నువ్వులు ఒక్కొటిగా వేసుకుంటూ మంచి సువాసనోచ్చేన్తవరకు వేపుకోండి.
చల్లార్చుకుని మిక్సీ లో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు మరో పాన్ నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి వేయించుకుని ఉడికించిన అన్నం, సాల్ట్, వేరుసెనగపప్పు పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసెయ్యండి.
కాస్త చల్లారాక బాక్స్ లో పెట్టుకోండి. చాలా సింపుల్ అనిపిస్తుంది కాని ఎంతో రుచి ఈ రైస్.