మిరియాల కోడి వేపుడు

| vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg చికెన్ (మీడియం సైజు ముక్కలు)
  • 75 ml నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 10 వెల్లులి పాయలు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 6 ఎండు మిర్చి
  • 1 tsp నెయ్యి
  • కొత్తిమీర – కొద్దిగా
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 1/4 tsp పసుపు
  • 1 tsp నిమ్మరసం
  • మసాలా పొడి కోసం
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • పత్తర్ ఫూల్ – కొద్దిగా
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp సొంపు
  • 2 tsp మిరియాలు
  • 3 లవంగాలు
  • 3 యాలకలు
  • 1 అనాసపువ్వు
  • 1 మరాఠీ మొగ్గు
  • 1 tbsp ధనియాలు

విధానం

  1. పెప్పర్ చికెన్ మసాలా పొడి కోసం మసాలా దీనుసులన్నీ అన్నీ వేసి లో ఫ్లేమ్ మీద సువాసన వచ్చేదాకా వేపుకుని దింపి పొడి చేసుకోవాలి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వెల్లులి, కరివేపాకు వేసి వెల్లులి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  3. ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపి అల్లం వెల్లులి ముదా వేసి వేపుకోవాలి.
  4. ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి హై-ఫ్లేమ్ మీద మూత పెట్టి చికెన్లోని నీరు పోయేదాక వేపుకోవాలి.
  5. వేగిన చికెన్లో ఉప్పు, కారం పసుపు, నిమ్మరసం, పెప్పర్ చికెన్ మసాలా పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు లేదా నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
  6. ప్రతీ 5 నిమిషాలకో సారి అడుగుపట్టిన మసాలాని గీరి కలుపుతో వేపుకోవాలి.
  7. చికెన్ వేగి నూనె పైకి తేలాక నెయ్యి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.