పర్ఫెక్ట్ రవ్వ ఉప్మా | సింపుల్ ఉప్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో
Breakfast Recipes
|
vegetarian
Prep Time5 Mins
Cook Time20 Mins
Servings3
కావాల్సిన పదార్ధాలు
1
cup బొంబాయ్ రవ్వ
1
tsp జీలకర్ర
3
tbsp నూనె
1
tsp ఆవాలు
2
tsp పచ్చి శెనగపప్పు
2
tsp మినపప్పు
2
రెబ్బలు కరివేపాకు
1
tbsp అల్లం
15
జీడిపప్పు
2
పచ్చిమిర్చి (సన్నని తరుగు)
1/4
cup నెయ్యి
ఉప్పు రుచికి సరిపడా
1
cup పాలు
3
cup నీళ్ళు
విధానం
ముకుడులో రవ్వ జీలకర్ర వేసి సన్నని సెగ మీద రవ్వ మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకుని దింపేసుకోండి. రవ్వ సువాసన రావడానికి కనీసం 10 నిమిషాలు సమయం పడుతుంది.
ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేపుకోవాలి.
వేగిన తాలింపులో నీళ్ళు పాలు పోసి హై-ఫ్లేమ్ మీద మరగ కాగనివ్వాలి.
వేపుకున్న రవ్వలో ఉప్పు కలిపి గరిటతో కలుపుతూ మరుగుతున్న ఎసరులో పోసుకోవాలి.
రవ్వని బాగా కలిపి 5 నిమిషాలు పాటు దగ్గర పడనిచ్చి, దింపి 5 నిమిషాలు వదిలేయండి.