పెసరపప్పు పూర్ణాలు

Sweets | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 14

కావాల్సిన పదార్ధాలు

  • పై పిండికి
  • 1/2 cup మినపప్పు (4 గంటలు నానబెట్టినది)
  • 1 cup బియ్యం పిండి
  • ఉప్పు – చిటికెడు
  • నీళ్ళు తగినన్ని
  • పెసరపప్పు పూర్ణానికి
  • 1 cup పెసరపప్పు (4 గంటలు నానబెట్టినది)
  • 1 cup పచ్చి కొబ్బరి తురుము
  • 1 1/4 cup బెల్లం తురుము
  • 1/2 tsp యాలకల పొడి
  • 1 tsp నెయ్యి
  • 1 tbsp నీళ్ళు
  • నూనె – బూరెలు వేపుకోడానికి

విధానం

  1. బియ్యం పిండిలో ఉపపేసి నీళ్ళతో మెత్తగా తడిపి గంటసేపు నానబెట్టుకోవాలి.
  2. మినపప్పుని నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. గంట నానిన బియ్యం పిండిలో రుబ్బుకున్న మినపపిండిని తగినన్ని నీళ్ళని కలిపి పక్కనుంచుకోండి (పై పిండి పర్ఫెక్ట్ గా ఏ జారులో ఉండాలో టిప్స్ చూడండి).
  4. నానిన పెసరపప్పుని కాసిని నీళ్ళతో ఇడ్లీ పిండి అంత చిక్కగా అట్ల పిండి అంత మెత్తగా రుబ్బుకుని ఇడ్లీ ప్లేట్స్లో వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోవాలి.
  5. స్టీమ్ అయిన ఇడ్లీలు చల్లారాక తీసి ముక్కలు చేసి గడ్డలు లేకుండా రవ్వగా చేసుకోండి. (వేడి మీద ముద్దగా ఉంటుంది చల్లారాక రవ్వగా అవుతుంది).
  6. పాన్లో నెయ్యి కరిగించి కొబ్బరి తురుముని ఒక నిమిషం వేపుకోవాలి. వేగిన కొబ్బరిలో బెల్లం నీళ్ళు పోసి బెల్లం కరిగి ఒక పొంగురానివ్వాలి.
  7. పొంగుతున్న పాకంలో రవ్వగా చేసుకున్న పెసరపప్పుని గడ్డలు ఉంటే వాటిని చిదుముకుంటూ పాకం పీల్చి దగ్గరపడానివ్వాలి. తరువాత పూర్తిగా చల్లార్చి నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోండి.
  8. పెసర ఉండలని కలిపి ఉంచుకున్న బియ్యం పిండిలో ముంచి పైకి లేపి నెమ్మదిగా విదిలిస్తే మందంగా ఉండే పిండి కిందికి జారీ పలుచున అవుతుంది, అప్పుడు వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోండి.
  9. ఇవి గంటల తరువాత కూడా చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయ్.