మైదాలో నీళ్ళు కలిపి చిక్కని పేస్ట్ చేసి పక్కనుంచుకోండి.
కట్ చేసుకున్న సమోసా షీట్స్ అంచులకి మైదా పూసుకోవాలి. తరువాత మధ్యలో స్టఫ్ఫింగ్ కొద్దిగా ఉంచి ముందు మూలని గట్టిగా అదిమిపెట్టి తరువాత మధ్యకి మడిచి గట్టిగా సీల్ చేయాలీ. పగుళ్ళు ఉంటే మైదా పూయాలి పగుళ్ళ మీద.
తయారు చేసుకున్న సమోసాలని వేడి నూనెలో లేత బంగారు రంగు కంటే కాస్త ఎక్కువగా వేపి తీసుకుంటే బయటకి తీశాక ఎర్రటి రంగు వచ్చేస్తాయ్.
ఈ సమోసాలు వేడిగా టొమాటో సాస్తో చెప్పలేనంత రుచిగా ఉంటాయ్.