ఆలూ బటానీ పులావ్

Flavored Rice | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Resting Time 15 Mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsp నూనె
  • 1 బిరియానీ ఆకు
  • 4 లవంగాలు
  • 5 యాలకలు
  • 1/2 tsp షాహీ జీరా
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 నల్ల యాలక
  • 1 మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • ఉప్పు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1 ఆలూ ముక్కలు (చెక్కు తీసినవి)
  • 1/2 cup బటానీ
  • 1 cup గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం (180 gm)
  • పుదీనా తరుగు – కొద్దిగా
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • 1 1/4 cup నీళ్ళు

విధానం

  1. కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ అక్కు, యాలకలు, లవంగాలు, షాహీజీరా, నల్ల యాలక వేసి వేపుకోవాలి.
  2. ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని ఆలూ ముక్కలు కూడా వేసి ఆలూ కూడా లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  3. ఆలూ వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి.
  4. ఎసరు నీళ్ళు పోసి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, బటానీ వేసి హై ఫ్లేమ్ మీద ఎసరు మరగనివ్వాలి.
  5. మరుగుతున్న ఎసరులో గంట సేపు కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం కొత్తిమీర పుదీనా వేసి కలిపి మూత పెట్టి 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి స్టీమ్ పోయేదాక ఉంచి తీసి చాలల్ని రైతా లేదా స్పైసీ పనీర్ కర్రీతో సర్వ్ చేసుకోండి.