పొట్లి సమోసా | సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా చూడడానికి కూడా ఇంపుగా చేస్తే తయారయ్యేదే పొట్లి సమోసా

Snacks | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 30 Mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • స్టఫ్ఫింగ్ కోసం
  • 2 ఆలూ
  • 1 cup కాలీఫ్లవర్
  • 1 cup కేరట్
  • నీళ్ళు ఉడికించడానికి
  • 2 tbsp నూనె
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1/2 cup తాజా బటానీ
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 2 చిటికెళ్లు పసుపు
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు
  • సమోసా షీట్స్ కోసం
  • 2 cup మైదా
  • 2 tsp నెయ్యి
  • ఉప్పు
  • నీళ్ళు తగినన్ని
  • నూనె సమోసాలు వేపుకోడానికి

విధానం

  1. కుక్కర్లో ఆలూ, కేరట్, కాలీఫ్లవర్ నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద రెండు విసిల్స్ రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి
  2. స్టీమ్ పోయాక కూరకాయలని వడకట్టి జల్లేడలోనే పూర్తిగా చల్లారనిచ్చి కచ్చాపచ్చాగా ఏనుపుకోవాలి
  3. నూనె వేడి చేసి అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేపి, బాటానీ వేసి రంగు మారి మెత్తబడే దాకా వేపుకోవాలి.
  4. తరువాత మిగిలిన మాసాలు వేసి వేపి ఏనుపుకున్న ఆలూ మిశ్రమం వేసి నీరు ఇగిరిపోయి దగ్గర పడేదాకా కలుపుతూ వేపుకోవాలి. గట్టి ముద్దగా అయ్యాక గాలికి పూర్తిగా చల్లారచాలి
  5. మైదా పిండిలో నెయ్యి ఉప్పు వేసి బ్రెడ్ పొడి మాదిరి వేళ్ళతో నిమురుతూ కలుపుకుని తగినన్ని నీళ్ళు చేరుస్తూ పిండి గట్టిగా పగుళ్లు లేకుండా వచ్చేదాక ఎక్కువసేపు వత్తుకుని తడిగుడ్డ కప్పి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  6. 30 నిమిషాల తరువాత పిండిని చిన్న ఉసిరికాయ సైజు ఉండలుగా చేసి పొడి పిండి అద్ది కాస్త మందంగా వత్తుకోవాలి
  7. వత్తుకున్న రోటీ మధ్యలో చల్లారిన ఆలూ మిశ్రమం పెట్టి అంచులకి నీళ్ళని పూసి మూతకట్టినట్లుగా పిండి ఒక దగ్గరికి చేర్చి అంచులని గట్టిగా సీల్ చేయాలీ. చేసుకున్న సమోసాలని గాలికి ఆరనివ్వాలి.
  8. ఆరిన సమోసాలని బాగా వేడెక్కిన నూనెలో లో వేసి స్టవ్ ఆపేసి వదిలేస్తే 2 నిమిషాలకి పైకి తెలుతాయ్, పైకి తేలాక అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి. లేదా గోరు వెచ్చని నూనెలో సమోసాలు వేసి సన్నని సెగమీదే బంగారు రంగు వచ్చి కరకరలాడేట్టు వేపుకుని తీసుకోవచ్చు.
  9. వేడిగా ఈ పొట్లి సమోసా పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్తో చాలా రుచిగా ఉంటాయ్.