ప్రాన్స్ ధం బిర్యానీ

| nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • రొయ్యలు నానబెట్టడానికి
  • 300 gms పచ్చి రొయ్యలు
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 నల్ల యాలక
  • 1.5 ఇంచులు దాల్చిన చెక్క
  • 1 tsp షాహీ జీరా
  • 1 బిర్యానీ ఆకు
  • 2 tbsp పుదీనా తరుగు
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1 tbsp కారం
  • 1 tsp గరం మసాలా
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • 2 tsp నిమ్మకాయ రసం
  • 3 tbsp నెయ్యి
  • 1/2 cup వేయించిన ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 175 ml పెరుగు
  • బిర్యానీ వండుకోడానికి
  • 2 liters నీళ్ళు
  • 1 tsp షాహీ జీరా
  • 3 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 నల్ల యాలక
  • 1.5 ఇంచులు దాల్చిన చెక్క
  • 1 బిర్యానీ ఆకు
  • 3 పచ్చిమిర్చి చీలికలు
  • 1.5 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 3 tsp ఉప్పు
  • 1.5 cup బాస్మతి బియ్యం (250 gm)
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు
  • ధం చేయడానికి
  • 2 tbsp వేపిన ఉల్లిపాయ తరుగు
  • 3 tbsp నెయ్యి
  • 1/2 tsp గరం మసాలా
  • 1 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు

విధానం

  1. రొయ్యలు నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి మసాలా బాగా పట్టించి గంట సేపు నానబెట్టుకోవాలి.
  2. అన్నం వండుకోడానికి నీళ్ళు మరిగించి మసాలా దినుసులు వేసి ఎసరుని బాగా మరిగించాలి.
  3. మరిగే నీళ్ళలో నానబెట్టిన బాస్మతి బియ్యం గులాబీ రేకులు వేసి 80% ఉడికించుకోవాలి
  4. 80% ఉడికిన అన్నాన్ని గంటసేపు నానుతున్న రొయ్యల మీద వేసుకోవాలి.
  5. 80% ఉడికిన అన్నం మీద ధం చేయడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసుకోండి.
  6. తరువాత మైదా పిండి ముద్ద ప్లేట్ అంచుకు పెట్టి ధం బయటకి పోకుండా సీల్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ధం చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  7. 20 నిమిషాల తరువాత అడుగు నుండి నెమ్మదిగా బిర్యానీ తీసి మిర్చి కా సాలన్తో సర్వ్ చేసుకోండి.