మునగాకు కూటు | మునగాకు పప్పు | రోగనిరోదక శక్తినిచ్చే మునగాకు పప్పు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • కూటు ఉడికించడానికి
  • 1 cup పెసరపప్పు
  • 3 tbsp పచ్చి శెనగపప్పు
  • 15 - 20 కాబూలీ సేనగలు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1 టొమాటో
  • 1 tsp పసుపు
  • 2.5 cup నీళ్ళు
  • తాలింపు కోసం
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 100 gm మునగాకు
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 3 ఎండు మిర్చి
  • 5 దంచిన వెల్లులి
  • 1/2 cup పచ్చి కొబ్బరి
  • 1 tbsp కొబ్బరి నూనె
  • ఉప్పు

విధానం

  1. పప్పులన్నీ గంట సేపు నానబెట్టినవి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి 4 కూతలు వచ్చే దాకా ఉడికించి దింపేసుకోండి.
  2. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి.
  3. మునగాకు వేసి పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి.
  4. మెత్తగా ఉడికిన పప్పు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోండి.
  5. ఆఖరుగా పచ్చికొబ్బరి, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోండి.