నెయ్యి బాగా వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ మినపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపుకొవాలి
తాలింపు కచ్చితంగా ఎర్రగా వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకుంటే చాలు. ఆ తరువాత పుదీనా ఆకులు వేసి ఆకుని మెత్తబడనివ్వాలి
మెత్తబడిన ఆకులు కారం ఉప్పు వేసి వేపుకోవాలి
వేగిన తాలింపులో మెత్తగా ఉడికించుకున్న పప్పు తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద పప్పుని బాగా ఉడకనిస్తే తాలింపు పుదీనా పరిమళమంతా పప్పుకి పడుతుంది.
బాగా ఉడికిన పప్పు దింపి నిమ్మరసం కలిపి దింపేసుకోవడమే!!!