నూనె-నెయ్యి కలిపి వేడి చేసి అందులో మసాలా దీనుసులన్నీ వేసి వేపుకోవాలి
తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి
వేగిన ఉల్లిపాయాలో ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లులి ముద్ద వేసి ఒక నిమిషం వేపుకోవాలి
పుదీనా పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి, నూనె పైకి తేలాక పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి.
వండుకున్న రైస్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. నచ్చితే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఆఖరున 10 తాజా పుదీనా ఆకులు, ఉంటే ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసుకోండి చాలా బాగుంటుంది. ఈ పులావ్ చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.
ఇదే పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో టిప్స్లో ఉంది చూడండి.