పంజాబీ ఢాబా తీరు పనీర్ భుర్జీ

Street Food | vegetarian

  • Prep Time 3 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం:
  • 2 tbsp సెనగపిండి
  • 1/2 cup పెరుగు
  • 1/4 Cup పాలు
  • 1/4 tbsp పసుపు
  • 1/2 tbsp నల్ల ఉప్పు
  • 1 tbsp కసూరి మేథీ
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం
  • 1 tbsp గరం మసాలా
  • 2 tbsp నెయ్యి
  • 1 tbsp కాశ్మీరీ కారం
  • బుర్జీ కోసం:
  • 2 tbsp నెయ్యి
  • 2 tbsp బటర్
  • 200 gms పనీర్
  • 1/2 tbsp జీలకర్ర
  • 1 Cup ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 1 tbsp అల్లం తురుము
  • 3 టమాటోల ముక్కలు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • కొత్తిమీర తరుగు
  • 1/2 cup వేడి నీరు
  • 1/2 నిమ్మరసం

విధానం

  1. సెనగపిండిని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసుకోండి
  2. మరో గిన్నెలో వేపిన సెనగపిండి గ్రేవీ కిశోరం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి ఉంచుకోండి
  3. సెనగపిండి వేపిన పాన్లో నెయ్యి కరిగించి కాశ్మీరీ కారం వేసి ఒక పొంగు రానిచ్చి వెంటనే కలిపి ఉంచుకున్న మసాలా పేస్ట్లో కలిపి ఉంచుకోండి. ఇలా వేపిన కాశ్మీరీ కారం వేయడం వల్ల మాంచి రంగు రుచి చేకూరుతుంది కూరకి.
  4. భుర్జీ కోసం నెయ్యి వెన్న కరిగించి జీలకర్ర వేసి చిట్లనివ్వాలి
  5. తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తురుము వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
  6. వేగిన ఉల్లిలో టమాటో తరుగు వేసి కలిపి మెత్తబడి దాకా వేపుకోవాలి.
  7. టొమాటోలు మెత్తబడ్డాక కలిపి ఉంచుకుని మసాలా మిశ్రమం ఉప్పు కొత్తిమీర తరుగు వేడి నీరు వేసి నెయ్యి పైకి తేలేకదా వేపుకోండి.
  8. నూనె పైకి తేలిన తరువాత పనీర్ని తురిమి వేసుకోండి. తరువాత వేడి నీరు వేసి నెయ్యి పైకి తేలేకదా వేపుకోండి
  9. దింపే ముందు కొత్తిమీర తరుగు నిమ్మరసం పిండి దింపేసుకోండి
  10. వేడి వేడిగా రోటీలు చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.