ముల్లంగి సాంబార్

Sambar - Rasam Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 45 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup కందిపప్పు
  • 3 cups నీళ్లు
  • 1/2 tsp పసుపు
  • 1/4 tsp ఇంగువ
  • సాంబార్ కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 4 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 7 - 8 వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 ఉల్లిపాయల చీలికలు
  • 3 పచ్చిమిర్చి చీలికలు
  • 200 gms ముల్లంగి ముక్కలు
  • 1 cup టమాటో ముక్కలు
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం
  • 1/2 cup చిక్కని చింతపండు పులుసు (60 gm చింతపండు నుండి తీసినది)
  • 1 tbsp సాంబార్ పొడి
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • 1/4 cup పచ్చికొబ్బరి తురుము
  • 750 ml నీళ్లు

విధానం

  1. నానబెట్టిన కందిపప్పుని, పసుపు ఇంగువ నీళ్లు కుక్కర్లో పోసి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి.
  2. మరో గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లులి కరివేపాకు వేసి వేపుకోవాలి.
  3. వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చాలు.
  4. మగ్గిన ఉల్లిపాయల్లో ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి 2 నిమిషాలు పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి, ఆ తరువాత మూత పెట్టి ముల్లంగి ముక్కలు సగం పైన మగ్గనివ్వాలి.
  5. మగ్గిన ముల్లంగిలో కారం ధనియాల పొడి కాసిని నీళ్లు పోసి వేపుకుంటే కారం మాడదు.
  6. వేగిన కారంలో టమాటో ముక్కలు చింతపండు పులుసు పోసి టొమాటోలు పులుసుని బాగా మరగనివ్వాలి.
  7. మరుగుతున్న పులుసులో మెత్తగా ఉడికించుకున్న పప్పు, నీళ్లు పోసి బాగా కలిపి హాయ్ ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
  8. మరుగుతున్న సాంబార్లో పచ్చికొబ్బరి తురుము, సాంబార్ పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద 40 నిమిషాలు వదిలేయండి, అప్పుడు సాంబార్ ఘుమఘుమలాడుతుంది. ముల్లంగి సాంబార్ వేడి అన్నం, అట్టు ఇడ్లీతో చాలా రుచిగా ఉంటుంది. (ఈ సింపుల్ సాంబార్ చేసే ముందు టిప్స్ చూసి చేయండి)