మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
బోనెల్స్ చికెన్ని ముప్పావు ఇంచ్ మందంగా రెండు ఇంచుల పొడవుగా కోసుకోండి.
తరుక్కున్న చికెన్కి మసాలా పేస్ట్ నిమ్మరసం ఉప్పు కరివేపాకు తరుగు గుడ్డు పట్టించి కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోండి. నేను రాత్రంతా నానబెట్టాను.
నానిన చికెన్లో కొత్తిమీర తరుగు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి కోటింగ్ గట్టిగా కలుపుకోండి.
జీడిపప్పు పలుకులు వేసి ప్రతీ చికెన్ ముక్కకి గట్టిగా అద్ది మరిగే వేడి నూనె మాన్తా అతగ్గించి ముక్కలు వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
అదే నూనె లో ఆఖరుగా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేపి చికెన్ పైన వేసి వేడి వేడిగా నిమ్మచెక్క ఉల్లిపాయ తరుగుతో సర్వ్ చేసుకోండి.