రసం రైస్ రెసిపీ | రసం సాదం

One Pot Recipe | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం (గంట సేపు నానబెట్టినవి)
  • 6 Cups నీళ్ళు
  • 1 టొమాటో
  • 50 gm చింతపండు (వేడి నీళ్ళలో నానబెట్టి తీసిన గుజ్జు)
  • ఉప్పు
  • 1.5 tbsp రసం పొడి
  • 1/4 tsp పసుపు
  • 2 tbsp పెసరపప్పు (గంటసేపు నానబెట్టినవి)
  • 2 tbsp కందిపప్పు (గంటసేపు నానబెట్టినవి)
  • తాలింపు
  • 2 tbsp నెయ్యి
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp ఇంగువ
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 2 కరివేపాకు రెబ్బలు
  • కొత్తిమీర తరుగు – చిన్నకట్ట

విధానం

  1. కుక్కర్లో నానబెట్టి బియ్యంలో పసుపు, నీళ్ళు, టొమాటో, పెసరపప్పు, కందిపప్పు వేసి 4.5 కప్పులు నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద 5 విసిల్స్ రానివ్వాలి.
  2. చింతపండు గుజ్జులో ఉప్పు, రసం పొడి వేసి కలిపి ఉంచుకోవాలి.
  3. ఉడికిన రసం సాదంలో నీళ్ళు చింతపండు గుజ్జు పోసి ఉడికిన అన్నంని కాస్త చిదుముకోవాలి. ఒక ఉడుకుపట్టాక దింపేసుకోవాలి.
  4. తాలింపుకోసం నెయ్యి కరిగించి అందులో తాలింపు సమగ్రీ అంతా వేసి వేపుకుని రసం సాదంలో కలుపుకోవాలి.