రవ్వలో బియ్యం పిండి, పుల్లటి పెరుగు, ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి పిండిని గట్టిగా కలుపుకుని 30 నిమిషాలు పక్కనుంచుకోండి.
30 నిమిషాల తరువాత మిగిలిన సామానంతా వేసి కొద్దిగా నీళ్ళు కలుపుకుని పిండిని కాస్త గట్టిగా ఇడ్లి పిండిలా కలుపుకోండి.
ఇప్పుడు పెనం మీద నూనె రాసి ఓ సారి ఉల్లిపాయ తో రుద్ది పిండి ని ఉతప్పంలా మందంగా స్ప్రెడ్ చేసుకుని పైనా అడై అంచుల వెంటా నూనె వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోండి.
ఓ సైడ్ ఎర్రగా కాలాకా మరో వైపు తిప్పి కాలుచుకుని వేడి వేడిగా టమాటో పచ్చడి లేదా సెనగపప్పు చట్నీతో తినండి.