ఇన్స్టంట్ రవ్వ కేసరి ప్రీ-మిక్స్

| vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 60 Mins
  • Total Time 22 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms బొంబాయ్ రవ్వ
  • 300 gms పంచదార
  • 150 gms నెయ్యి
  • 75 gms పాలపొడి
  • 75 gms డ్రై ఫ్రూట్స్
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • 1 tbsp యాలకల పొడి
  • 1 cup నీళ్ళు

విధానం

  1. కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఎర్రగా వేపి పక్కనుంచుకోండి.
  2. అదే పాన్లో మిగిలిన నెయ్యి వేసి కరిగించి బొంబాయ్ రవ్వ వేసి లో- ఫ్లేమ్ మీద రవ్వ రంగు మారి బంగారు రంగులోకి వచ్చే దాకా కలుపుతూ వేపుకోవాలి.
  3. ఎర్రగా వేగిన రవ్వని పూర్తిగా చల్లరనివ్వాలి.
  4. చల్లారిన రవ్వలో చక్కెర, డ్రై ఫ్రూట్స్, పాల పొడి, యాలకల పొడి వేసి బాగా కలిపి గాలి చోరని డబ్బాలో ఉంచుకంటే 4 నెలలు నిలవుంటుంది.
  5. కేసరి చేయాలనుకున్నప్పుడు, ఒక కప్పు నీళ్ళులో కుంకుమ పువ్వు వేసి బాగా మరగనివ్వండి.
  6. మరో పాన్లో ½ tsp నెయ్యి వేసి కప్ ప్రీ- మిక్స్ వేసి రవ్వ వేడెక్కేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  7. మరుగుతున్న నీళ్ళు వేపుకున్న రవ్వలో పోసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గర పడనిచ్చి దింపేసుకోండి. అంతే బెస్ట్ రవ్వ కేసరి రెడీ.