రవ్వ ఖజూర్

Instant Recipes | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 15 Mins
  • Resting Time 30 Mins
  • Servings 15

కావాల్సిన పదార్ధాలు

  • 1 ½ cups Bombay Rava/బొంబాయి రవ్వ
  • ½ cups Coconut Powder/కొబ్బరి పొడి
  • 1 cup Sugar/పంచదార
  • ¼ cup Cherries (Grated)/చేర్రీల తరుగు
  • 2 tbsp Dry dates/ఎండు ఖర్జూరం తరుగు
  • 1 tbsp Oil/నూనె
  • 1 tsp Baking Powder/బేకింగ్ పౌడర్
  • ½ tsp Cardamom Powder/యాలకల పొడి
  • 4-5 drops Pineapple Essence/పైనాపిల్ ఎసెన్స్
  • Oil for Frying/నూనె వేపుకోడానికి
  • ¼ - 1/3 water/నీళ్లు

విధానం

  1. రవ్వలో నూనె, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి.
  2. కొబ్బరి పొడి చెర్రీల తరుగు, ఎండు ఖర్జూరం ముక్కలు కొద్దిగా నీరు వేసి రవ్వని నిమురుతూ తడపండి
  3. తడిచిన రవ్వలో పంచదార యాలకులపొడి ఇంకా మిగిలిన నీరుపోసి రవ్వని ముద్దగా తడిపి ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి
  4. ముప్పై నిమిషాలు నానిన రవ్వలో పైనాపిల్ ఎసెన్స్ వేసి కలుపుకోండి
  5. మరిగే వేడి నూనెలో బొండాల మాదిరి వేసి 2- నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తే ఖజూరాలు గట్టి పడతాయ్.
  6. 3 నిమిషాల తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ మీడియం మీదే లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసి జల్లెడలో లేదా బుట్టలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచితే వారం రోజులు నిలవుంటాయ్.