రవ్వ లడ్డు | మా స్టైల్ లో రవ్వ లడ్డు చేస్తే తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే

Sweets | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Resting Time 120 Mins
  • Total Time 20 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బొంబాయి రవ్వ (250 gms)
  • 1/2 cup పచ్చి కొబ్బరి తురుము
  • 3 tbsps నెయ్యి (50 gms)
  • 10 - 15 జీడి పప్పు
  • 10 - 15 ఎండు ద్రాక్ష
  • 1 cup పంచదార (175 gms)
  • 100 ml నీళ్ళు
  • 3 - 4 యాలకల పొడి

విధానం

  1. రవ్వని పచ్చి కొబ్బరిని కలిపి రెండు గంటలు వదిలేయండి.
  2. బాండి లో నెయ్యి వేసి కరిగించి జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించి తీసి పక్కనుంచుకోండి.
  3. ఇప్పుడు రెండు గంటలు నానబెట్టుకున్న రవ్వ వేసి సన్నని మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపుకోండి. (కేవలం లో ఫ్లేం లోనే వేపుకోవాలి) దీనికి కనీసం 20-25 నిమిషాలు పడుతుంది.
  4. మరో బాండిలో పంచదార నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించండి.
  5. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వ, జీడిపప్పు కిస్మిస్స్ వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారనివ్వండి.
  6. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి, లేదంటే పొడి పొడి గా అయిపోతుంది. ఇప్పుడు గడ్డలుగా అయిపోయిన రవ్వని చిదుముకుని దాంట్లో యాలకలపొడి వేసి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టాలి.
  7. చల్లారక ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే కనీసం వారం పాటు ఫ్రెష్ గా ఉంటాయి.