రవ్వ పులిహోర

Prasadam | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం రవ్వ
  • 2 cups నీళ్లు
  • 1/4 tsp ఉప్పు
  • 1 tsp నూనె
  • 1/2 tsp పసుపు
  • 2 కరివేపాకు - రెబ్బలు
  • తాలింపు కోసం:
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • జీడిపప్పు - చిన్న గుప్పెడు
  • 1/2 tsp మిరియాలు
  • 3 చల్ల మిరపకాయాలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 tsp అల్లం తరుగు
  • ఇంగువ - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • 2 tbsp నిమ్మకాయ రసం

విధానం

  1. నీళ్లలో ఉప్పు నూనె వేసి తెర్ల కాగనివ్వాలి.
  2. మరుగుతున్న నీరులో బియ్యం రవ్వ పోస్తూ గరిటతో కలుపుకోవాలి, అప్పుడు గడ్డలు ఏర్పడవు.
  3. కలుపుకున్న రవ్వని అన్నం వండుకున్నట్లే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా వండుకోవాలి.
  4. వండుకున్న అన్నంలో పసుపు కరివేపాకు వేసి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటి వేసి ఎర్రగా వేపుకోవాలి.
  6. వేగిన తాలింపుని చల్లారిన రవ్వలో వేసుకోండి, ఇంకా పైన అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి నెమ్మదిగా పట్టించి పులిహోరని 30 నిమిషాలైనా ఊరనివ్వాలి.