అరటికాయ బజ్జి | వంట సోడా వాడకుండా తక్కువ నూనె పీల్చేలా టిప్స్ తో

Snacks | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 15 Mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 2 కూర అరటికాయలు
  • 1.5 cup సెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • 3/4 tsp కారం
  • ఉప్పు
  • 1/4 spoon పసుపు
  • 1 tsp జీలకర్ర
  • 2 tsps వేడి నూనె
  • నీళ్ళు తగినన్ని
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. అరటికాయకున్న చెక్కుని పల్చగా తీసేయ్యాలి, మరీ లోపల తెల్లగా ఉండే కండ కనపడేలా తీయకూడదు.
  2. తరువాత పొడవుగా ¼ ఇంచ్ ముక్కలుగా కోసుకోవాలి.
  3. సెనగపిండి లో మిగిలిన సామానంతా వేసి బాగా కలిపిన తరువాత వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి, ఆ తరువాత తగినన్ని నీళ్ళు చేర్చి జారుగా పిండి కలుపుకోవాలి.
  4. తరుగుకున్న అరటికాయ ముక్కలు పిండి లో వేసి ముంచి పైకి లేపితే పల్చగా పిండి పట్టుకుంటుంది అరటికాయ, అప్పుడు వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆ తరువాత హై ఫ్లేం లోకి పెట్టి ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోవాలి.
  5. ఇవి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయ్.