అరటికాయ అల్లం ఉల్లికారం

Veg Curries | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 పచ్చి ఆరటికాయలు
  • 1/2 liter నీళ్లు
  • ఉప్పు- కొద్దిగా
  • పసుపు - కొద్దిగా
  • అల్లం ఉల్లి ముద్ద కోసం
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 4-5 పచ్చిమిర్చి
  • 1/2 inch అల్లం
  • కూర కోసం
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp పచ్చి సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1 tsp నిమ్మరసం

విధానం

  1. మరిగే నీళ్లలో సగానికి కోసుకున్న అరటికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి 80% ఉడికించి దింపేసుకోవాలి.
  2. చల్లారాక అరటికాయ తొక్క తీసి ఫోర్క్తో కచ్చా పచ్చాగా ఎనుపుకోవాలి.
  3. మిక్సీలో ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
  4. నూనె వేడి చేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  5. వేగిన తాలింపులో ఉల్లి ముద్ద ఉప్పు పసుపు కరివేపాకు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  6. వేగిన ఉల్లి ముద్దలో ఎనుపుకున్న అరటికాయ ముద్దా వేసి నెమ్మదిగా ఉల్లి ముద్ద పట్టించాలి. తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి.
  7. దింపే ముందు కొత్తిమీర తరుగు నిమ్మరసం చల్లి కలిపి దింపేసుకోవాలి.