పనసకాయ బిర్యానీ

Biryanis | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 30 Mins
  • Total Time 55 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం
  • 1 tbsp మిరియాలు
  • 6-7 యాలకాలు
  • 6 - 7 లవంగాలు
  • 2 అనాసపువ్వు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 జాపత్రి
  • 1 tbsp సొంపు
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp ధనియాలు
  • 1 బిర్యానీ ఆకు
  • 1 పత్తర్ ఫూల్
  • 1 ఇంచ్ అల్లం
  • 7 - 8 వెల్లూలీ
  • బిర్యానీ కోసం
  • 4 tbsps నూనె పనసకాయ ముక్కలు వేపడానికి
  • 1/2 cup నూనె బిర్యానీ కి
  • 300 gms పనసకాయ ముక్కలు
  • 1 cup డబుల్ బీన్స్
  • 3 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tsp జీలకర్ర
  • 4 లవంగాలు
  • 1 అనాస పువ్వు
  • 200 gms ఉల్లిపాయ చీలికలు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • చిన్న కట్ట పుదీనా తరుగు
  • చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp పసుపు
  • 1.5 tsp కారం
  • 50 ml నీళ్ళు (మసాలాలు వేపడానికి)
  • 1/2 cup పాలు
  • 1/2 cup చిలికిన పెరుగు
  • 5 cups వేడి నీళ్ళు
  • 2.5 cups బాస్మతి బియ్యం
  • 1/4 cup నెయ్యి
  • 1 నిమ్మకాయ

విధానం

  1. ముకుడులో మసాలా దినుసులు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపి, అందులోనే అల్లం వెల్లూలీ కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. ముకుడులో 4 tbsp నూనె వేడి చేసి పనసకాయ ముక్కలు వేసి ముక్కలు మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసి పక్కనుంచుకోండి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. ఉల్లిపాయలు మెత్తబడ్డాక డబుల్ బీన్స్ వేసి మెత్తగా అయ్యేదాక వేపుకోవాలి.
  6. టొమాటో ముక్కలు, పుదీనా కొత్తిమీర తరుగు, పసుపు, కారం, మసాలా పేస్ట్ 50 ml నీళ్ళు పోసి మసాలాలు లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. పనసకాయ ముక్కలు, చిలికిన పెరుగు, పాలు, నిమ్మకాయ రసం వేసి నూనె పైకి తేలేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి.
  8. నూనె తేలేకా బాస్మతి బియ్యం వేసి మెతుకు విరగకుండా మసలాలు పట్టించి వేడి వేడి నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  9. 10 నిమిషాల తరువాత బిర్యానీ 80% కుక్ అయిపోతుంది. అప్పుడు బిర్యానీలోకి గరిటతో అక్కడక్కడా కడిపితే స్టీమ్ వదులుతుంది. ఆ తరువాత నెయ్యి వేసి మూతపెట్టేయండి.
  10. తరువాత బిర్యానీ గిన్నెని అట్ల పెనం మీదకి షిఫ్ట్ చేసి 10 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనిచ్చి, స్టవ్ ఆపేసి 30 నిమిషాలు కదపకుండా వదిలేయాలి. ఆ తరువాత అట్ల కాడతో అడుగు నుండి తీసుకోండి.
  11. ఈ స్పైసీ బిర్యానీ చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.