పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి | దీని రుచి సూపర్

Curries | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 3 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 100 gm పచ్చిమామిడి ముక్కలు
  • 15 - 20 పచ్చిమిర్చి (మీడియం కారం ఉన్నవి)
  • 1/2 cup వేరుసెనగపప్పు
  • ఉప్పు
  • తాలింపుకి
  • 1 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp మినపప్పు
  • 1/2 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు

విధానం

  1. వేరుసెనగపప్పుని కడిగి కనీసం రెండు గంటలు నానబెట్టాలి
  2. 2 గంటల తరువాత మిక్సీలో నానిన వేరుసెనగపప్పు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  3. ఇప్పుడు నూనె వేడి చేసి తాలింపు సామాను ఒక్కొటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాకా వేపి పచ్చడి లో కలిపేయండి.