రాయలసీమ పల్లీ పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 8 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup వేరుశెనగగుళ్ళు
  • 10 ఎండు మిర్చి
  • ఉప్పు
  • చింతపండు - ఉసిరికాయంత
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1 టమాటో ముక్కలు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp పసుపు
  • 7 - 8 వెల్లులి
  • 3 tbsp నూనె

విధానం

  1. కప్పు పల్లీలని సన్నని సెగ మీద వేపి, చల్లార్చి పొత్తు తీసి ఉంచుకోవాలి.
  2. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
  3. వేగిన ఎండుమిర్చి పొట్టు తీసుకున్న పల్లీలు నానబెట్టుకున్న చింతపండు తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. నూనెలో ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు వేసి వేపుకోవాలి తరువాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి తీసి మీకేసీ జార్లో వేసి 3-4 సార్లు పల్స్ చేసి తీసుకొండి.
  5. మెదిగిన పచ్చడిలో ఆఖరుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేడివేడిగా కిచిడి, అట్టు ఇడ్లీ ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.