రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం
  • 2 tbsp నూనె
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • ఉప్పు
  • 1 tsp జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి
  • 2 టొమాటో
  • 2 చిటికెళ్లు పసుపు
  • 1/4 cup పచ్చి కొబ్బరి
  • నీళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోడానికి
  • కూర కోసం
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 10 వెల్లులి
  • 1 tsp మిరియాలు
  • 2 tsp కారం
  • 2 tbsp ధనియాల పొడి
  • 10 - 12 వంకాయ
  • 1/3 cup చింతపండు (70 gm చింతపండు నుండి తీసినది)
  • ఉప్పు
  • 1/4 cup కొత్తిమీర

విధానం

  1. నూనె వేడి చేసి మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి వేపుకుని ఆఖరున టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
  2. వేపుకున్న టొమాటో ఉల్లిపాయని మిక్సీలో వేసి అందులోనే పచ్చికొబ్బరి ముక్కలు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి ( నిజానికి కొబ్బరి నూనెలోనె వేపాలి నేను మర్చిపోయా అందుకే గ్రైండ్ చేసేప్పుడు వేసి మేనేజ్ చేశా).
  3. నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లులి మిరియాలు ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
  4. ఉల్లిపాయలు మెత్తబడ్డాక చీరిన వంకాయలు, ఉప్పు వేసి వంకాయలు మెత్తబడే దాకా మూతపెట్టి వేపుకోవాలి.
  5. వంకాయలు మెత్తబడ్డాక కారం, ధనియాల పొడి వేసి వేపుకోవాలి తరువాత చింతపండు పులుసు పోసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  6. నూనె పైకి తేలాక మసాల పేస్ట్ కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద నూనె పైకి వచ్చేదాక ఉడికించుకోవాలి.
  7. నూనె పైకి వచ్చాక కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకోవాలి. ఈ నూనె వంకాయ కూర వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.