బెండకయ బజ్జీ | బెండకాయ పుల్ల కూర

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 10 వెల్లులి
  • 2 ఉల్లిపాయ
  • 2 టొమాటో
  • 1/2 tsp పసుపు
  • ఉప్పు
  • 8 పచ్చిమిర్చి
  • 50 gm చింతపండు (నానబెట్టినది)
  • 300 ml నీళ్ళు
  • 300 బెండకాయ ముక్కలు (అంగుళం ముక్కలు)
  • తాలింపు
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 4 ఎండుమిర్చి
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో వెల్లులి వేసి వేగనివ్వాలి. వేగిన వెల్లులి లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం మగ్గనివాలి.
  2. మగ్గిన ఉల్లిపాయాల్లో టొమాటో ముక్కలు, పసుపు ఉప్పు వేసి టొమాటో మెత్తబడేదాకా వేపుకోవాలి.
  3. మెత్తబడిన టొమాటోలో బెండకాయ ముక్కలు వేసి కలిపి బెండకాయలో జిగురు వదిలేదాక మూతపెట్టి మగ్గించుకోవాలి.
  4. బెండకాయాల్లో జిగురు వదిలిన తరువాత పచ్చిమిర్చి, చింతపండు నీళ్ళు పోసి బెండకాయ మెత్తగా అయ్యేదాక మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి.
  5. మెత్తగా మగ్గిన బెండకాయ బజజీని దింపి పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి
  6. నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టి బజ్జీలవ కలుపుకోవాలి.
  7. ఈ బెండకాయ బజ్జీ వేడిగా అన్నంలోకి, జొన్న రొట్టె, రాగి సంగటిలోకి చాలా రుచిగా ఉంటుంది.