చిల్లీ గార్లిక్ నూడుల్స్ | రెస్టారెంట్ స్టైల్ స్పైసీ ఇండో- చైనీస్ వెజ్ నూడుల్స్ రెసిపీ

Chinese Veg Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm నూడుల్స్
  • నీళ్ళు – ఉడికించుకోడానికి
  • 1 tbsp ఉప్పు
  • 2 tsp నూనె (ఉడికించడానికి, ఉడికాక నూడుల్స్ పైన వేయడానికి)
  • నూడుల్స్ టాసింగ్కి
  • 3 tbsp నూనె
  • 3 tbsp వెల్లులి తరుగు
  • 2 tbsp పండు మిర్చి తరుగు
  • 2 ఎండు మిర్చి
  • చిన్న ఉల్లిపాయ చీలికలు
  • 1/2 cup ఎల్లో కాప్సికం చీలికలు
  • 1/2 cup రెడ్ కాప్సికం ముక్కలు
  • 1/2 cup గ్రీన్ కాప్సికం ముక్కలు
  • ఉప్పు
  • 1 tsp మిరియాల పొడి
  • 1 tbsp టొమాటో సాస్
  • 1 tsp గ్రీన్ చిల్లీ సాస్
  • 1 tbsp డార్క్ సోయా సాస్
  • 1 tsp తెల్ల మిరియాల పొడి
  • 1 tsp ఆరోమెట్ పొడి
  • 1 tsp వెనిగర్
  • 1 tbsp నీళ్ళు
  • 1 tbsp చిల్లీ ఫ్లేక్స్
  • 1/4 cup ఉల్లి కాడల తరుగు

విధానం

  1. గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఉప్పు నూనె వేసి నీళ్ళని మసల కాగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో మాత్రమే నూడుల్స్ వేసి హై- ఫ్లేమ్ మీద 80% కుక్ చేసుకోవాలి
  2. ఉడికిన నూడుల్స్ లోని నీటిని ఓంపేసి ప్లేట్లో వేసి నూడుల్స్ పైన నూనె వేసి నూడుల్స్ విరగకుండా ఫోర్క్తో కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి
  3. పాన్లో నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత వెల్లులి, పండుమిర్చి, ఎండు మిర్చి తరుగు వేసి వేపుకోవాలి
  4. వేగిన వెల్లులిలో ఉల్లిపాయ, మూడు రంగుల కాప్సికం వేసి హై-ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు టాస్ చేస్తే 60% వేగుతాయ్
  5. పాన్లో చల్లారిన నూడుల్స్ వేసుకోండి. ఇంకా మిగిలిన పదార్ధాలన్నీ వేసి హై-ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు టాస్ చేసుకోవాలి
  6. దింపే ముందు వెనిగర్, నీళ్ళు, ఉల్లి కాడలువేసి మరో నిమిషం టాస్ చేసి దింపేసుకోండి
  7. వేడిగా వెజ్ మంచూరియా లేదా టొమాటో కేట్చాప్ తో చాలా రుచిగా ఉంటాయ్ నూడుల్స్.