బెస్ట్ స్వీట్ చిల్లీ చికెన్

Restaurant Style Recipes | nonvegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms బోన్లెస్ చికెన్
  • 2 tbsp గిలకొట్టిన గుడ్డు
  • 1 tbsp మైదా
  • 1 tbsp కార్న్ ఫ్లోర్
  • సాల్ట్
  • 3 tsp నీళ్ళు
  • గ్రేవీ కోసం
  • 2 tbsp నూనె
  • 1.5 tbsp వెల్లులి తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 7 - 8 ఉల్లిపాయ పెద్ద పాయలు
  • 5 - 6 గ్రీన్ కాప్సికం ముక్కలు
  • 5 - 6 ఎల్లో కాప్సికం ముక్కలు
  • 5 - 6 రెడ్ కాప్సికం ముక్కలు
  • 1/2 tsp ఆరొమేట్ పౌడర్
  • 1 tsp వైట్ పెప్పర్ పొడి
  • సాల్ట్
  • 1/2 tsp పంచదార
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1 tbsp గ్రీన్ చిల్లీ సస్స్
  • 1.5 tbsp చైనీస్ చిల్లీ పేస్ట్
  • 1 tbsp స్వీట్ చిల్లీ సాస్
  • 1 tsp టొమాటో కేట్చాప్
  • 1/2 tsp డార్క్ సోయా సాస్
  • 1 tsp తేనే
  • 300 ml నీళ్ళు
  • 2 tbsp స్ప్రింగ్ ఆనీయన్ తరుగు

విధానం

  1. చికెన్లో మిగిలిన సామానంతా వేసి పల్చని కోటింగ్ ఇవ్వాలి.
  2. కోటింగ్ ఇచ్చిన చికెన్ని వేడి వేడి నూనెలో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి.
  3. పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లులి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేసి వెల్లులి ఎర్రబడే దాకా ఫ్రై చేసుకోవాలి.
  4. తరువాత కాప్సికం ఇంకా మిగిలిన వెజ్జీస్ అన్నీ వేసి 1 నిమిషం టాస్ చేసుకోవాలి.
  5. టాస్ చేసుకున్న వెజ్జీస్లో మిగిలిన సాసులు అన్నీ వేసి టాస్ చేసి 300ml నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద సాసులు కాస్త చిక్కబడనివ్వాలి.
  6. హై ఫ్లేమ్ మీద సాసులు కొద్దిగా చిక్కబడ్డాక వేపుకున్న చికెన్ వేసి మరో 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి, దింపే ముందు తేనె స్ప్రింగ్ ఆనీయన్ తరుగు చల్లి కలిపి దింపేసుకోవాలి.