బియ్యం పిండి మురుకులు | కారప్పూస | జంతికలు | చక్రాలు
Snacks
|
vegetarian
కావాల్సిన పదార్ధాలు
250
gms బియ్యం
50
gms మినపప్పు
1
tbsp నూనె
ఉప్పు
1
tbsp వాము
నూనె- వేపుకోడానికి
నీళ్ళు పిండి తడుపుకోడానికి
విధానం
బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా మర ఆడించి మళ్ళీ జల్లించి పిండి వాడుకోండి. (ఇదే కేజీకి చేసుకొంటే కేజీ బియ్యానికి 200 gms మినపప్పు, కప్పుల్లో అయితే కప్ బియ్యానికి అదే కప్ తో 5వ వంతు మినపప్పు.
ఈ పిండిలో ఉప్పు నూనె, నలిపిన వాము వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాలపకండి.
చక్రాల/కారప్పూస గిద్దలో నూనె రాసి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టి, పిండి ముద్ద పెట్టి తడి ఆకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద చిన్న చిన్న చుట్టలుగా వేసుకోండి, ఆ తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే కరకరలాడేట్టు వేపుకోండి.