కావాల్సిన పదార్ధాలు
-
రవ్వ కోసం
-
1
cup బియ్యం
(185 gms)
-
1
tbsp కందిపప్పు/పెసరపప్పు
-
1
tsp మిరియాలు
-
1
tsp జీలకర్ర
-
ఉప్మా కోసం
-
2
tbsps నూనె
-
1
tsp ఆవాలు
-
3/4
tsp మినపప్పు
-
1
tsp సెనగపప్పు
-
1
ఎండు మిర్చి
-
1/4
చిప్ప పచ్చి కొబ్బరి తురుము
-
1
రెబ్బ కరివేపాకు
-
1.25
tsp ఉప్పు
-
3
cups నీళ్ళు
-
1
tbsp నెయ్యి
విధానం
-
బియ్యాన్ని కడిగి వడకట్టి, చెమ్మగా/తడిగా ఉండగానే మిరియాలు, కందిపప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి పల్చగా నీడన ఆరబెట్టాలి.
-
గంట తరువాత పొడి పొడిగా ఆరిపోతాయ్, అప్పుడు మిక్సీ లో వేసి పల్స్ చేసుకుంటూ రవ్వగా ఆడించుకుని తీసుకోవాలి.
-
అడుగు మందంగా ఉన్న గిన్నె లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేపుకోవాలి.
-
తరువాత మిరపకాయ, కరివేపాకు వేసి వేపుకోవాలి.
-
ఎసరు నీళ్ళు పోసి అందులో ఉప్పు, పచ్చికొబ్బరి తురుము వేసి నీళ్ళని తెర్ల కాగనివ్వాలి, హై ఫ్లేం మీద.
-
నీళ్ళు మసులుతుండగా, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి పూర్తిగా మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యన అడుగు నుండి కలుపుతుండాలి.
-
దింపే ముందు 1 tbsp నెయ్యి వేసి కలిపి దింపేయాలి. వేడిగా ఆవకాయ/ మాగాయ తో చాలా రుచిగా ఉంటుంది.