బీరకాయ కోడి గుడ్డు పొరుటు | బ్యాచిలర్స్ కి ఆఫీస్ వెళ్ళే వారికీ బెస్ట్ కర్రీ
Bachelors Recipes
|
vegetarian
Prep Time5 Mins
Cook Time15 Mins
Servings3
కావాల్సిన పదార్ధాలు
400
gms చెక్కు తీసిన లేత బీరకాయ ముక్కలు
4
గుడ్లు
2
ఉల్లిపాయ
2
చీలికలు పచ్చిమిర్చి
1
tsp అల్లం తరుగు
1
tsp జీలకర్ర
2
ఎండుమిర్చి
1
రెబ్బ కరివేపాకు
2
tsp కొత్తిమీర
1/4
tsp పసుపు
1
tsp కారం
ఉప్పు
1
tsp ధనియాల పొడి
గరం మసాలా- చిటికెడు
1/4
cup నూనె
విధానం
నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, అల్లం వేసి వేపుకోండి.
ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి పచ్చి వాసన పోయే దాక వేపి బీరకాయ ముక్కలు వేసి ఇందులోనే కారం, పసుపు, ఉప్పు బాగా కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం-ఫ్లేం మీద మగ్గించుకోండి.
నూనె పైకి తేలగానే గుడ్లు కూర మీద కొట్టి కదపకుండా మూత పెట్టి మీడియం ఫ్లేం మీద కూర 3-4 నిమిషాలు మగ్గనివ్వండి
3 నిమిషాల తరువాత ముక్కలుగా గరిటతో కట్ చేసి బాగా కలిపి కూర లోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి, ఈ కూర వేగి నూనె పైకి తేలడానికి పన్నెండు పదిహేను నిమిషాలు పడుతుంది.
నూనె పైకి తేలగానే కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి కలిపి దిమ్పెసుకోవడమే!