కాల్చిన వంకాయ దోసకాయ పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms 1 - పెద్ద వంకాయ
  • 150 gms 1 - పెద్ద దోసకాయ
  • 7 - 8 పచ్చిమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • ఉప్పు
  • గోలీ సైజు నానబెట్టిన చింతపండు
  • 4 - 5 వెల్లులి
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1 tsp నూనె

విధానం

  1. నూనె పూసి వంకాయని సన్నని సెగ మీద మెత్తబడే దాక కాల్చుకోవాలి.
  2. కాల్చుకున్న వంకాయ మీద నీళ్లు చల్లి పొట్టు తీసుకోండి. వంకాయ లోపల గింజలు తీసేయండి.
  3. వంకాయ గుజ్జు, పచ్చి మిర్చి, జీలకర్ర, చింతపండు, వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  4. గ్రైండ్ చేసుకున్న వంకాయ గుజ్జులో చెక్కు గింజలు తీసేసిన దోసకాయ ముక్కలు వేసి కలిపి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  5. ఈ పచ్చడి నెయ్యి వేసిన అన్నంతో, పెరుగన్నంతో చాలా రుచిగా ఉంటుంది.