సగ్గుబియ్యం బొండాలు

Snacks | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 15 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 3/4 Cup సగ్గుబియ్యం
  • 1 Cup పుల్లని పెరుగు
  • 1/2 Cup నీళ్లు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/4 Cup ఉల్లిపాయ తరుగు
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tbsp జీలకర్ర
  • 1/4 Cup బియ్యం పిండి
  • 1/4 tbsp అల్లం తురుము
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)

విధానం

  1. సగ్గుబియ్యంలో పెరుగు నీళ్లు కలిపి ఐదు గంటలు నానబెట్టుకోండి. ఐదు గంటల తరువాత సగ్గుబియ్యం మెత్తబడుతుంది
  2. ఐదు గంటల తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోండి.
  3. అవసరాన్ని బట్టి తగినన్ని నీళ్లు చిలకరించుకోండి. పిండి కాస్త చిక్కగా ఉండాలి
  4. చేతులు తడి చేసి వేడి నూనె లో చిట్టి పూనుకుల మాదిరి వేసుకోండి. రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఆ తరువాత హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేపి తీసుకోండి.