బెల్లం లో కాసిని నీళ్ళు పోసి కరిగించి పక్కనుంచుకోండి.
పాన్లో నెయ్యి కరిగించి జీడిపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి, మిగిలిన నెయ్యిలో సెమియా సగ్గుబియ్యం వేసి సెమియా రంగు మారేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి.
వేగిన సెమియాలో వేసి నీళ్ళు పోసి కలిపి సగ్గుబియ్యం మెత్తబడేదాకా మూతపెట్టి ఉడికించుకోండి.
మరో పాన్లో 1 tsp నెయ్యి వేసి పచ్చి కొబ్బరి పలుకులు వేసి ఎర్రగా వేపుకుని తీసుకోండి.
సగ్గుబియ్యం నాకు 17 నిమిషాలకి ఉడికిపోయింది అప్పుడు పలుచని కొబ్బరి పాలు, కరిగించిన బెల్లం నీళ్ళు పోసి 2 పొంగులు రానివ్వాలి (మాములు పాలతో చేసే వారు పైన టిప్స్ చూడండి).
ఆఖరుగా యాలకలపొడి, వేపిన జీడిపప్పు, కిస్మిస్ వేపిన కొబ్బరి పలుకులు వేసి కలిపి దింపేసుకోండి.