ఉప్పు ఉండలు | చిప్స్ లేని కాలంనాటి హెల్తీ స్నాక్

Snacks | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1.5 cup బియ్యం
  • నీళ్ళు/పుల్లని మజ్జిగ – తగినన్ని
  • తాలింపు కోసం
  • 3 tbsps నూనె
  • 1 tsp ఆవాలు
  • 2 tbps పచ్చి శెనగపప్పు
  • 2 tbsps మినపప్పు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి తరుగు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 1/3 cup పచ్చి కొబ్బరి పలుకులు
  • ఉప్పు – రుచికి సరిపడ

విధానం

  1. బియ్యాన్ని కడిగి 5 గంటలు నానబెట్టాలి. నానిన బియ్యాన్ని వడకట్టి నీళ్ళతో/ పుల్లని మజ్జిగతో మెత్తగా రుబ్బుకోవాలి
  2. పాన్లో నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆఖరున పచ్చిమిర్చి వేసి 30 సెకన్లు మాత్రమే వేపుకోవాలి
  3. వేపుకున్న తాళింపులో రుబ్బుకున్న బియ్యం పిండి ఉప్పు వేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడే దాకా కలిపి దింపేసుకోవాలి
  4. దింపుకున్న పిండి ముద్దలో కొబ్బరి పలుకులు వేసి వేడి మీదే చేతులకి నూనె రాసుకుని చేతి మణికట్టుతో బాగా వత్తుకోవాలి. వత్తుకున్న పిండిని నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి
  5. చేసుకున్న ఉండలని ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  6. ఈ ఉండలు వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటాయ్.