షేజ్వాన్ ఫ్రైడ్ చికెన్

Chinese Non-Veg Recipes | nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Total Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ కోటింగ్ కోసం
  • 300 gms బోన్లెస్ చికెన్
  • ఉప్పు
  • 2 tsp గిలకొట్టిన గుడ్డు
  • 2 tsp మైదా
  • 2 tsp కార్న్ ఫ్లోర్
  • 1 tbsp నీళ్ళు
  • నూనె వేపుకోడానికి
  • చికెన్ టాస్ చేయడానికి
  • 3 tsp నూనె
  • 4 ఎండు మిర్చి
  • 4 వెల్లూలి తరుగు
  • 1 tbsp అల్లం సన్నని తరుగు
  • 2.5 tbsp షేజ్వాన్ సాస్
  • 1/2 tsp ఆరోమతిక్ పౌడర్
  • 1/2 tsp వైట్ పెప్పర్ పౌడర్
  • 3/4 tsp మిరియాల పొడి
  • 1/8 tsp పంచదార
  • ఉప్పు
  • 3/4 tsp అనాసపువ్వు పొడి
  • 3/4 tsp డార్క్ సోయా సాస్
  • 1/3 cup నీళ్ళు
  • 2 tbsps ఉల్లి కాడల తరుగు

విధానం

  1. బోన్లెస్ చికెన్ లో ఉప్పు, గుడ్డు కార్న్ ఫ్లోర్ మైదా వేసి బాగా కోట్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్ళు వేసుకోండి.
  2. వేడి నూనెలో కోట్ చేసుకున్న చికెన్ వేసి పైనా కోటింగ్ క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసుకోండి.
  3. సాస్ పాన్ లో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, వెల్లూలి, అల్లం తరుగు వేసి హై ఫ్లేం మీద వేపుకోవాలి.
  4. వెల్లూలి వేగాక షేజ్వాన్ సాస్, ఆరోమేటిక్ పౌడర్ తో పాటు మిగిలిన సాసులు అన్నీ వేసి హై ఫ్లేం మీద టాస్ చేసుకోవాలి.
  5. సాసులు వేగాక నీళ్ళు పోసి హై ఫ్లేం మీద సగంయ్యేదాక మరిగించాలి.
  6. మరిగిన సాసులో వేపిన చికెన్ ముక్కలు వేసి హై ఫ్లేం మీద టాస్ చేయాలి. ఇంకా సాస్ కాస్త మిగిలుండగానే ఉల్లికాడల తరుగు వేసి టాస్ చేసి దిమ్పెసుకోవాలి.