కావాల్సిన పదార్ధాలు
-
120
gms సేమియా
-
250
gms పెరుగు
-
సాల్ట్
-
ఓ కీర దోసకాయ తురుము
-
1
tsp తాలింపులు
(ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు,మినపప్పు)
-
1/2
tsp మిరియాల పొడి
-
2
tbsps కొత్తిమీర తరుగు
-
కరివేపాకు
(ఓ రెబ్బ)
-
చిన్న అల్లం ముక్క
-
1
పచ్చిమిర్చి
-
10 - 15
జీడిపప్పు
-
దానిమ్మ గింజలు
-
1
ltr నీళ్ళు
-
2
tbsps నూనె
విధానం
-
నీళ్ళు బాగా మసల కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియా వేసి జస్ట్ 30 సేకన్లు నుంచి ఓ నిమిషం పాటు ఉంచి వెంటనే వార్చేయండి
-
వార్చిన సేమియా పైన చల్లటి నీళ్ళు పోసి పూర్తిగా చల్లారనివ్వండి
-
తాలింపు కోసం నూనె వేడి చేసి, అందులో జీడిపప్పు వేసి వేపుకుని,తీసి పక్కనుంచుకోండి.
-
అదే నూనె లో తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి వేపుకుని చల్లార్చుకొండి.
-
కమ్మటి పెరుగుని బాగా చిలుక్కుని, కీర దోసకాయ తురుము వేసి, సాల్ట్ వేసి బాగా కలుపుకొండి.
-
చల్లార్చుకున్న సేమియా, చల్లార్చుకున్న తాలింపు, మిరియాల పొడి, దానిమ్మ గింజలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోండి.
-
ఇది చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది