సేమియా కేసరీ | తక్కువ టైమ్ లో అయిపోయె బెస్ట్ స్వీట్

Sweets | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సెమియా
  • 2 cup నీళ్ళు
  • 3/4 cup పంచదార
  • 1/4 cup జీడిపప్పు
  • 2 tbsp ఎండు ద్రాక్ష
  • 2 tbsp నెయ్యి
  • 1 tsp యాలకల పొడి
  • కుంకుమపువ్వు

విధానం

  1. నెయ్యి కరరిగించి జీడీపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  2. మిగిలిన నెయ్యిలో సెమియా వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  3. నీళ్ళు పోసి కుంకుమ పువ్వు వేసి హై ఫ్లేమ్ మీద మరగ కాగనివ్వాలి.
  4. మరుగుతున్న నీళ్ళలో వేపిన సెమియా వేసి ఇంకా కొంచెం నీరుగా ఉండే వరకు మీడియం- ఫ్లేమ్ మీద ఉడికించాలి.
  5. తరువాత పంచదార, యాలకల పొడి వేసి దగ్గర పడే దాకా ఉడికించాలి. దింపే ముందు వేపిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి దింపేసుకోవాలి.