రవ్వ పాయసం | సులభంగా చేసుకునే కమ్మని పాయసం ఈ రవ్వ పాయసం

Sweets | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/4 cup బొంబాయ్ రవ్వ (60 gm)
  • 1/3 cup పంచదార (80 gm)
  • 1/2 cup నీళ్ళు (120 ml)
  • 1/4 cup జీడిపప్పు
  • 1/4 cup నెయ్యి
  • 1/2 liter పాలు
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • 3 tbsp చిరోన్జి పప్పు (30 నిమిషాలు నానబెట్టినది)
  • 1/2 tsp యాలకలపొడి
  • 1/4 pinch పచ్చ కర్పూరం

విధానం

  1. నెయ్యి కరిగించి జీడిపప్పు ఎర్రగా వేపి తీసుకోండి.
  2. అదే నెయ్యిలో రవ్వ వేసి ఎర్రగా వేపుకోవాలి సన్నని సెగ మీద. రవ్వ వేగాక నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి నెయ్యి పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  3. రవ్వలోంచి నెయ్యి పైకి తేలాక పాలు పోస్తూ రవ్వని గడ్డలు లేకుండా కలుపుకోవాలి.
  4. రవ్వ పాలల్లో కలిసిపోయాక అప్పుడు చిరోన్జి పప్పు, వేసి కలుపుతూ 10-12 నిమిషాలు లేదా చిక్కబడే దాకా ఉడికించాలి.
  5. పాయసం చిక్కబడుతుండగా పంచదార, కుంకుమపువ్వు, యాలకలపొడి, జీడిపప్పు వేసి కలిపి దింపేసుకోండి. నచ్చితే ¼ చిటికెడు పచ్చ కర్పూరం వేసుకోవచ్చు (edible camphor )