గోంగూర పులుసు | పాతకాల పద్ధతిలో గోంగూర పులుసు

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • పులుసు కోసం
  • 250 gms గోంగూర ఆకు
  • 1/4 cup పచ్చిశెనగపప్పు
  • 1/2 liter నీళ్ళు
  • 10 సాంబార్ ఉల్లిపాయలు (లేదా పెద్ద ఉల్లిపాయ చీలికలు)
  • 5 పచ్చిమిర్చి (చీలికలు)
  • 2 pinches చిటికెళ్లు పసుపు
  • 2 tsp శెనగపిండి
  • 1.5 tbsp బెల్లం
  • 300 ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
  • మెంతి కారం కోసం
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మెంతులు
  • 6 - 7 ఎండు మిర్చి
  • ఇంగువా – చిటికెడు
  • 1 tbsp నూనె

విధానం

  1. పులుసు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మూతపెట్టి శెనగపప్పు మెత్తగా ఉడకనివ్వాలి.
  2. నూనెలో మెంతులు, ఆవాలు వేసి మెంతులు రంగు మారి ఆవాలు చిటచిట అనేదాక వేపి ఎండుమిర్చి, ఇంగువ వేసి వేపుకోండి.
  3. వేగిన మెంతులు ఆవాలని మెత్తని పొడి చేసుకోండి
  4. శెనగపప్పు మెత్తగా ఉడికికాక చింతపండు పులుసు, మెంతి కారం, ఉప్పు వేసి బాగా కలిపి సన్నని సెగ మీద 5 నిమిషాలు ఉడికిస్తే మెంతికారం పరిమళం రుచి పులుసుకి పడుతుంది.
  5. శెనగపిండిలో నీళ్ళుపోసి గడ్డలు లేకుండా బాగా కలిపి పులుసులో పోసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది
  6. దింపే ముందు బెల్లం వేసి కలిపి దింపేసుకోండి.
  7. ఈ పులుసు అన్నం, రాగి సంగటి. జొన్న రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది