నూనె వేడి చేసి ఉల్లిపాయలు పచ్చి మిర్చి వేసి ఉల్లిపాయలు పింక్ కలర్ లోకి వచ్చే దాక ఫ్రై చేసుకోండి (ఉల్లిపాయలు ఎర్రగా వేపకండి)
అల్లం వెల్లూలి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేపి టమాటో వేసి గుజ్జు గా అయ్యేదాకా లో-ఫ్లేం మీద మగ్గించుకోండి
నూనె పైకి తేలాక అప్పుడు ఉప్పు తో పాటు మిగిలిన మసాలా పొడులన్నీ వేసి నూనె తేలేదాక వేపుకోండి
ఇప్పుడు ముప్పై నిమిషాలు వేడి నీటి లో నానా బెట్టిన సోయా గ్రానుల్స్ లోని నీటిని పిండి వేసి మీడియం ఫ్లేమ్ మీద మసాలాలు బాగా పట్టించి మంచి సువసనోచ్చెంత వరకు వేయించుకోండి
సోయా పచ్చివాసన పోయి మగ్గాక నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని పుదినా తరుగు వేసి లో-ఫ్లేం మీద నీరు ఇగిరిపోయి కూర లోంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే చాలు.