సొయా కుర్మా

Curries | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 15 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మిల్మేకర్
  • 3 Cups వేడి నీళ్లు
  • ఉప్పు (కొద్దిగా)
  • మసాలా పేస్ట్ కోసం:
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1/4 tbsp మిరియాలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • అల్లం (చిన్న ముక్క)
  • 5 వెల్లులి
  • 2 ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • కుర్మా కోసం:
  • 5 tbsp నూనె
  • 1/2 tbsp పసుపు
  • 1 బిర్యానీ ఆకు
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • 2 పచ్చిమిర్చి (చీరినవి)
  • 2 Sprigs కరివేపాకు
  • 1 Cup టమాటో పేస్ట్
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1/4 tbsp గరం మసాలా
  • 1 1/4 Cup నీళ్లు
  • 1/2 Cup చిలికిన పెరుగు
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1 tbsp కసూరీ మేథీ
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. మిల్మేకర్ లో వేడి నీళ్లు ఉప్పు వేసి 15 నిమిషాలు నానబెట్టి తరువాత నీటిని పిండి పక్కనుంచుకొండి
  2. మిక్సీ జార్లో మసాలా పేస్ట్ సామాగ్రీ అంతా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. 1 Tbsp నూనె వేడి చేసి అందులో మిల్మేకర్ కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం వేపి తీసుకోండి
  4. మిగిలిన నూనె వేడి చేసి అందులో యాలకలు లవంగాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి వేపుకోండి
  5. వేగిన మసాలాల్లో ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేగనివ్వాలి.
  6. ఉల్లిలోంచి నూనె పైకి తేలిన తరువాత టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేపి మిగిలిన మసాలాలు కొద్దిగా నీరు పోసి వేపుకోండి
  7. వేగిన మసాలాల్లో మిల్మేకర్ వేసి కలుపుకోవాలి, ఆ తరువాత నీరు పోసి 7-8 నిమిషాలు ఉడికించి మూత తీసి బాగా చిలికిన పెరుగు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి
  8. దింపే ముందు కొత్తిమీర తరుగు కసూరి మేథీ వేసి కలిపి నిమ్మరసం పిండి స్టవ్ ఆపేసి దింపేసుకుంటే ఘుమఘుమలాడే మిల్మేకర్ లేదా సొయా మసాలా కుర్మా తయారు