దాభా స్టైల్ ఆలూ పాలక్

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm పాలకూర ఆకుల తరుగు
  • 200 gm చెక్కు తీసి ఉడికించుకున్న ఆలూ
  • 3 tbsp నూనె
  • 1/2 tsp జీలకర్ర
  • 4 ఎండుమిర్చి
  • 1 tsp వెల్లులి తరుగు
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 2 tsp నెయ్యి
  • నీళ్లు - పాలక్ ఉడికించడానికి

విధానం

  1. మరిగే నీళ్లలో పాలకూర ఆకు తరుగు వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చల్లని నీళ్లలో వేసి ఉంచండి.
  2. ఆకు చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి. తాలింపు వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ మెత్తబడ్డాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
  5. ఉల్లిపాయ వేగిన తరువాత అల్లం వెల్లులి ముద్దా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి.
  6. వేగిన మసాలాల్లో గ్రైఇండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ అవసరమైతే కాసిని నీళ్లు పోసి పలుచన చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  7. పాలకూర 10-12 నిమిషాలకి ఉడికి నూనె పైకి వస్తుంది అప్పుడు ఉడికించుకున్న ఆలూ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
  8. దింపే ముందు నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసి కలిపి దింపేసుకోవడమే!