పాలకూర సాంబార్

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Total Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup కంది పప్పు
  • 200 gms పాలకూర
  • 300 ml చింతపండు (పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసినది)
  • 3 పచ్చిమిర్చి
  • 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 1/2 tsp పసుపు
  • 2 tbsp సాంబార్ పొడి
  • 2 tbsp కొత్తిమీరా
  • 1/2 liter నీళ్ళు
  • 2 tsp నూనె
  • 1/2 tsp మెంతులు
  • 1/2 tsp ఆవాలు
  • 1/4 tsp ఇంగువ
  • 3 ఎండు మిర్చి
  • 2 కరివేపాకు

విధానం

  1. ముకుడులో కందిపప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
  2. మెత్తగా ఉడికిన కందిపప్పుని మిక్సీ వేసుకోవాలి .
  3. నూనె వేడి చేసి అందులో ఆవాలు , మెంతులు ఎండు మిర్చి వేసి వేపుకోవాలి.
  4. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. పాలకూర తరుగు వేసి పసరు వాసన పోయేదాక వేపుకోవాలి.
  6. నూనె పైకి తేలిన పాలకూరలో చింతపండు పులుసు, ½ లీటర్ నీళ్ళు పోసి ఒక పొంగు రానివ్వాలి.
  7. పొంగుతున్న పులుసులో ఏనుపుకున్న సాంబార్ పొడి వేసి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  8. మరుగుతున్న సాంబార్లో ఏనుపుకున్న కందిపప్పు, కారం వేసి సాంబార్ మరగనివ్వాలి .
  9. ఆఖరున కొత్తిమీర వేసి కలిపి దింపేయండి.