స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చిల్లి చికెన్ | చిల్లి చికెన్
Chinese Non-Veg Recipes
|
nonvegetarian
Prep Time5 Mins
Cook Time25 Mins
Servings3
కావాల్సిన పదార్ధాలు
కోటింగ్ కోసం
300
gms చికెన్ (బోన్/బోన్లేస్స్ చికెన్))
1/2
tsp అల్లం వెల్లూలి పేస్టు
1/2
tsp ఉప్పు
1/4
tsp గరం మసాలా
1/2
tsp కారం
2
చితికేళ్ళు అజినోమోటో
2
tsp గిల కొట్టిన గుడ్డు
2
tsp మైదా
2
tbsp కార్న్ ఫ్లోర్
1/4
cup నీళ్ళు
నూనె వేపుకోడానికి
టాసింగ్ కోసం
1/4
cup నూనె
4
వెల్లూలి తరుగు
3
పచ్చిమిర్చి తరుగు
2
tbsps ఉల్లిపాయ తరుగు
1/2
కాప్సికం ముక్కలు
1/2
ఉల్లిపాయ ముక్కలు
150
ml నీళ్ళు
1/2
tsp అల్లం వెల్లూలి పేస్టు
1/2
tsp సాల్ట్
1/2
tsp గరం మసాలా
1.5
tbsp కారం
1/2
tsp మిరియాల పొడి
3/4
tsp తెల్ల మిరియాల పొడి
1/4
tsp అజినోమోటో
2
tbsp గ్రీన్/రెడ్ చిల్లి సాస్
1
tbsp డార్క్ సోయా సాస్
1
tbsp వెనిగర్
2
tbsp కొత్తిమీర
విధానం
ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ లో ముందు అల్లం వెల్లూలి ముద్దా, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా పట్టించాలి
గుడ్డు సోన కూడా వేసి బాగా పట్టించి మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి నీళ్ళతో తడి పొడిగా ఉండే గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి
ఆఖరున అజినోమోటో వేసి కలుపుకొండి. నచ్చకపోతే వదిలేయోచ్చు
వేడి నూనె లో చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా వేపుకోవాలి
పాన్ లో నూనె వేడి చేసి అందులో వెల్లూలి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, కాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేం మీద 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి.
నీళ్ళు పోసి అల్లం వెల్లూలి పేస్టు వేసి నీళ్ళని తెర్ల కాగనివ్వాలి హై ఫ్లేం మీద.
తెర్లుతున్న నీళ్ళలో మిగిలిన సాసులు కారాలు అన్నీ వేసి బాగా కలిపి కాస్త చిక్కబడనివ్వాలి.
సాసులు చిక్కబడగానే వేపుకున్న చికెన్ వేసి హై మీద బాగా పట్టించాలి. సాసులు పీల్చుకున్నాక, కొత్తిమీర తరుగు చల్లి వేడిగా ఎంజాయ్ చేయండి.