ఉల్లిపాయని పొట్టు తీసి సన్నని చీలికలుగా తరుక్కోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా చీరుకోండి
చీరుకున్న ఉల్లీ పచ్చిమిర్చిలో మిగిలిన మసాలాలు అన్నీ వేసి ఉల్లిపాయల్ని పిండుతూ పట్టించండి.
తరువాత సెనగపిండి, బియ్యం పిండి వేసి ఉల్లిపాయాలకి నెమ్మదిగా వత్తకుండా పట్టించాలి( ఒక్క సారి టిప్స్ చుడండి)
ఆఖరుగా పిండిని గట్టి ముద్ద చేయడానికి ఒక్కే చెంచా నీరు చిలకరించాలి
మరిగే నూనెలో పకోడీ పిండి ముద్దని తీసి నలుపుతూ నూనెలో చిన్న ముద్దలుగా వేసుకోవాలి. పకోడీనీ మీడియం ఫ్లేమ్ మీద పకోడీ రంగు మారి గట్టిపడే దాకా వేపుకోవాలి. పకోడీ వేగడానికి సమయం పడుతుంది కొంచెం ఓపిక అవసరం.
పకోడీ రంగు మారి గట్టి పడగానే మంట హై ఫ్లేమ్లోకి పెట్టి ఒక్క నిమిషం వేపితే నూనెని పీలిచిన పకోడీ వదిలేస్తుంది ఇంకా కారకరా వేగుతుంది. అప్పడు తీసి జల్లెడలో వేసి వేదిలేయండి. పకోడీ వేడి మీద కాస్త మెత్తగా అనిపిస్తుంది, చల్లరే కొద్దీ జల్లెడలో ఉన్న పకోడీ గట్టి పడుతుంది.
ఆఖరుగా 3 రెబ్బలు కరివేపాకు నూనెలో వేసి ఎర్రగా వేపి తీసి పకోడీ మీద వేసేయండి.