కాకరకాయల చెక్కు తీసి మధ్యకి చీరి లోపలి గింజలు తీసేయండి.
ఉప్పు, పసుపు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న ఉప్పుని కాకరకాయ లోపల బయట అన్ని వైపులా రుద్ది 30 నిమిషాలు వదిలేయండి.
మూకుడులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ మంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసి చల్లార్చుకోవాలి.
అదే మూకుడులో ధనియాలు, జీలకర్ర, వెల్లూలి, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే దాక లో- ఫ్లేం మీద కలుపుతూ వేపుకోవాలి.(నచ్చితే కాకరకాయ గింజలు కూడా వేసి వేపుకోవచ్చు).
కొబ్బరి ఇంకా వేపుకున్న ధనియాల అన్నీ మిక్సీ లో వేసి అందులోనే ఉప్పు బెల్లం వేసి పొడి చేసుకోండి.
ఊరుతున్న కాకరకాయలని గట్టిగా పిండితే చేదు దిగుతుంది.
మూకుడులో నూనె వేడి చేసి అందులో పిండుకున్న కాకరకాయలు వేసి నూనె కాకరకాయల పైకి తోస్తూ ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
చల్లారిన కాకరకాయల్లో కొబ్బరి కారం స్టఫ్ఫ్ చేసి అన్నం తో సర్వ్ చేసుకోండి.
నచ్చితే కాకరకాయలు సగం పైన వేపుకుని తీసి, చల్లారిన తరువాత అందులో పొడి కూరి మళ్ళీ నూనె లో వేపుకోవచ్చు. ఆఖరున మిగిలిన పొడి వేసుకోవచ్చు.