కోకో పొడి పొడి కస్టర్డ్ వెనీలా పొడిలో కాసిని పాలు పోసి గడ్డలు లేకుండా కలిపి పక్కనుంచుకోండి.
మిగిలిన పాలను మరిగించి, చక్కర వేసి పూర్తిగా కరిగిపోయే వరకు కలపండి.
వేడి పాలలో కోకో-కస్టర్డ్ స్లర్రీ మరియు సన్నగా తరిగిన డార్క్ చాక్లెట్ ముక్కలను వేసి కలుపుతూ, మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేయండి.
చిక్కబడిన చాకోలెట్ మిశ్రమంని పూర్తిగా చల్లార్చి ఫ్రిజ్లో కనీసం ఐదు ఆరు గంటలు ఉంచండి.
చల్లబడి చిక్కబడిన కోల్డ్ కోకోని గ్లాసుల్లో నింపి పైన కోకో పౌడర్ లేదా కొన్ని చాకోలెట్ తురుము చల్లి సర్వ్ చేయండి.